సూపర్-12లో నేడు ఆసియా జట్ల సమరం... తొలి మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్

24-10-2021 Sun 15:28
  • టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశ పోటీలు
  • షార్జాలో శ్రీలంక, బంగ్లాదేశ్ సమరం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • రాత్రి జరిగే మ్యాచ్ లో భారత్, పాక్ ఢీ
All Asian battles today in Super Twelve
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 పోటీలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే రెండు మ్యాచ్ లు ఆసియా జట్ల మధ్యే కావడం విశేషం. షార్జాలో ఆతిథ్యమిచ్చే తొలి మ్యాచ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. దుబాయ్ లో జరిగే రెండో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే... టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక ఛేదనకే మొగ్గుచూపాడు.

ఇరుజట్లలోనూ స్పిన్నర్లు, ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహంలేదు. రెండు జట్లలోనూ ఒక్కో మార్పు జరిగింది. బంగ్లాదేశ్ జట్టులో పేసర్ తస్కిన్ మహ్మద్ స్థానంలో నసూమ్ అహ్మద్ జట్టులోకి రాగా, శ్రీలంక జట్టులో మహీశ్ తీక్షణ స్థానంలో బినుర ఫెర్నాండోకు తుదిజట్టులో స్థానం కల్పించారు.