ఏపీలో ఇక హైస్కూళ్ల పరిధిలోకి 3, 4, 5వ తరగతులు

24-10-2021 Sun 15:10
  • పాఠశాల విద్యలో సర్కారు సంస్కరణలు
  • హైస్కూల్ హెచ్ఎంల పర్యవేక్షణలో 3, 4, 5వ తరగతులు
  • 1, 2వ తరగతులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన
  • మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
AP School Education dept issues new guidelines
పాఠశాల విద్యలో సంస్కరణల్లో భాగంగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో ఇకమీదట 3, 4, 5వ తరగతులు హైస్కూళ్ల పరిధిలోకి తెస్తున్నట్టు వెల్లడించింది. 3, 4, 5వ తరగతులు హైస్కూల్ హెచ్ఎంల పర్యవేక్షణలో కొనసాగుతాయని పేర్కొంది.  3, 4, 5వ తరగతులకు సీనియర్ ఎస్జీటీలను కేటాయిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ వివరించింది. 1, 2వ తరగతులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన ఉంటుందని తెలిపింది.