కోర్టు తీవ్రమైన అభిశంసన చేసినా డీజీపీ స్పందించడంలేదు: సోమిరెడ్డి

24-10-2021 Sun 14:39
  • పోలీసు వ్యవస్థపై కోర్టు అభిశంసన చేసిందన్న సోమిరెడ్డి
  • పోలీసు శాఖకు మాయని మచ్చ అని వెల్లడి
  • పోలీసు వ్యవస్థపై కోర్టు నమ్మకం కోల్పోయిందని వివరణ
  • డీజీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు
Somireddy comments on DGP and Police dept
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణం ఏంటి? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. పోలీసు శాఖపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందన్న దానికి నిదర్శనం తాజా వ్యాఖ్యలేనని పేర్కొన్నారు. సీఎంకు ఓ న్యాయం, హైకోర్టు న్యాయమూర్తులకు మరో న్యాయమా? అంటూ కోర్టు ప్రస్తావించిందని వివరించారు.

కోర్టు తీవ్ర అభిశంసన చేసినా కూడా డీజీపీ స్పందించకపోవడం సరికాదని, పోలీసు విభాగం ప్రతిష్ఠకు ఇది మాయనిమచ్చ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన పోలీసులు, రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిపై దూషణల విషయంలో ఇంత ఉత్సాహం ఎందుకు చూపించలేదని హైకోర్టు ప్రశ్నించడం తెలిసిందే.