అవకాశాలు వస్తున్నాయి .. కానీ నటించాలని లేదు: చార్మీ

24-10-2021 Sun 12:21
  • హీరోయిన్ గా కంఫర్ట్ గా ఉండేదానిని
  • నిర్మాతగా ఉండే బాధ్యత ఎక్కువ
  • అందరి కంఫర్ట్ చూడాల్సి ఉంటుంది
  • అలా అని చెప్పేసి నాకేమీ అసంతృప్తి లేదు
Charmi shocking Comments
తెలుగు తెరకు పరిచయమైన అందమైన కథానాయికలలో చార్మీ ఒకరు. చాలా వేగంగా ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లింది. నాయిక ప్రధానమైన సినిమాలలోను నటించి మెప్పించింది. ఆ తరువాత ఆమె నటనను పక్కన పెట్టేసి, పూరి నిర్మాణంలో భాగస్వామిగా ఉంటోంది.

తాజా ఇంటార్వ్యులో ఆమె మాట్లాడుతూ .. "హీరోయిన్ గా ఉండటంలోనే ఎక్కవ కంఫర్ట్ ఉంటుంది .. ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెడితే సరిపోతుంది. నిర్మాతగా బాధ్యతలను స్వీకరించడం మాత్రం అంత తేలికైన విషయమేం కాదు. అప్పుడు అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది.

హీరోయిన్ గా ఉన్నప్పుడు నా పని వరకూ నేను చూసుకుంటే సరిపోయేది. కానీ నిర్మాతగా మారిన తరువాత అలా కుదరదు. గాడిద చాకిరీ చేయవలసి వస్తోంది. అలా అని చెప్పేసి నాకేమీ విసుగు అనిపించడం లేదు. నటిగా నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే ఆలోచన మాత్రం లేదు" అని చెప్పుకొచ్చింది.