హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ స‌మ‌స్య అంత‌గా లేదు: సీపీ అంజ‌నీ కుమార్

24-10-2021 Sun 11:24
  • ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థుల‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం
  • అన‌ర్థాల‌పై విద్యార్థుల‌కు సూచ‌న‌లు
  • డ్ర‌గ్స్ జోలికి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వ్యాఖ్య‌
no drugs issue in hyderabad
యువ‌త జీవితాల‌ను నాశ‌నం చేస్తోన్న డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డకూడ‌ద‌ని హైద‌రాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థుల‌తో క‌లిసి పోలీసులు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇందులో ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్, సుభాష్ రెడ్డి, ఓయూ వీసీ ర‌వీంద‌ర్ పాల్గొన్నారు. హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ కూడా పాల్గొని మాట్లాడారు.

డ్ర‌గ్స్‌ వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాల‌పై విద్యార్థుల‌కు ఆయ‌న వివ‌రించి చెప్పారు. భార‌త్‌లోని ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చి చూస్తే హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ స‌మ‌స్య అంత‌గా లేద‌ని తెలిపారు. అయినా న‌గ‌ర‌వాసులు డ్ర‌గ్స్ జోలికి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. డ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ల‌లోనూ ప్ర‌చారం చేయ‌నున్నారు.