'ఎనిమి' ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్!

24-10-2021 Sun 11:20
  • విశాల్ తాజా చిత్రంగా 'ఎనిమి'
  • మరో ప్రధానమైన పాత్రలో ఆర్య 
  • యాక్షన్  ప్రధానంగా సాగే కథ 
  • నవంబర్ 4వ తేదీన విడుదల
Good responce for Enemy Trailer
మొదటి నుంచి కూడా విశాల్ తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అందువలన ఇక్కడ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంది .. మార్కెట్ ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సినిమా రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'ఎనిమి'.

విశాల్ .. ఆర్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను వినోద్ కుమార్ నిర్మించగా, ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. మృణాళిని రవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మమతా మోహన్ దాస్ కీలకమైన పాత్రను పోషించింది. నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణస్నేహితుల కథనే 'ఎనిమి' అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు .. ఛేజింగులతో ఈ ట్రైలర్  ఉత్కంఠభరితంగా సాగింది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారనే విషయం అర్థమవుతోంది. 'అన్నాత్తే'కి పోటీగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా బరిలో దిగుతుండటం విశేషం.