పురుగుల మందుతాగి ప్రేమ జంట‌ ఆత్మహత్య

24-10-2021 Sun 10:52
  • న‌ల్ల‌గొండ‌ జిల్లాలోని అనుముల మండలంలో ఘ‌ట‌న‌
  • పెద్ద‌లు ఒప్పుకోవ‌డం లేద‌ని ప్రేమికుల మ‌న‌స్తాపం
  • ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు
lovers commits suicide
న‌ల్ల‌గొండ‌ జిల్లాలోని అనుముల మండలం, తెట్టేకుంటలో ఓ ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు (21) అదే గ్రామానికి చెందిన‌ సంధ్య (19) కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నారు. వారి ప్రేమ‌కు ఇరువురి కుటుంబాలు అడ్డు చెప్ప‌డంతో ప్రేమికులు మ‌న‌స్తాపానికి గుర‌య్యారు.

ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం త‌మ గ్రామ‌ సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున కొండ‌లు, సంధ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు త‌దుప‌రి దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.