దూసుకుపోతున్న 'రాధే శ్యామ్' టీజర్!

24-10-2021 Sun 10:41
  • ప్రభాస్ నుంచి 'రాధే శ్యామ్'
  • రొమాంటిక్ లవ్ చుట్టూ తిరిగే కథ
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • జనవరి 14వ తేదీన విడుదల
Radhe Shyam movie update
'బాహుబలి' సినిమా రాజ్యం  .. ఆధిపత్యం .. పోరాటం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత ప్రభాస్ చేసిన 'సాహో' భారీ యాక్షన్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ రెండు సినిమాల్లో కూడా రొమాన్స్ పాళ్లు తక్కువ. అందువలన ఈ సారి రొమాన్స్ పాళ్లు ఎక్కువగా దట్టించిన 'రాధే శ్యామ్' సినిమాతో ప్రభాస్ పలకరించనున్నాడు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థల నుంచి వస్తోంది. నిన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఫస్టు పోస్టర్స్ మాదిరిగా రొమాన్స్ తో కూడిన బిట్స్ తో ఈ టీజర్ ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ ప్రభాస్ .. విక్రమాదిత్య పాత్రపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 20 గంటల్లోనే ఈ టీజర్ 30 మిలియన్ లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. అదే స్పీడ్ తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతూనే ఉంది. జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.