Pakistan: నేడు టీమిండియాతో మ్యాచ్‌పై పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పంద‌న‌

  • గత ఫలితాల గురించి ఆలోచించడం లేదు
  • మా బలాలపైనే దృష్టి సారించాం
  • భారత్‌తో మ్యాచ్‌ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాం
  • టోర్నీకి వెళ్లేముందు ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడాం
babar azam on t20 match

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా భార‌త్‌, పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య నేడు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మ్యాచ్ పై స్పందించాడు. తాము గత ఫలితాల గురించి ఆలోచించడం లేదని, ప్ర‌స్తుతం త‌మ‌ బలాలపైనే దృష్టి సారించి ఈ మ్యాచ్ ఆడ‌నున్నామ‌ని చెప్పాడు.

భారత్‌తో మ్యాచ్‌ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యామ‌ని, ఒత్తిడి పెంచుకోవడం లేదని తెలిపాడు. త‌మ‌ బ్యాటింగ్ ఆర్డ‌ర్ బ‌లంగా ఉంద‌ని చెప్పాడు. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ యూఏఈలో పరిస్థితుల గురించి త‌మకు మంచి అవగాహన ఉందని ఆయ‌న అన్నాడు. అక్క‌డి పిచ్‌ గురించి ఎలాంటి సమస్య లేదని చెప్పాడు.

తాము ప్రపంచ‌క‌ప్‌ టోర్నీకి వెళ్లేముందు త‌మ దేశ‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్ తో మాట్లాడామ‌ని తెలిపాడు. ఆయ‌న త‌మ‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారని చెప్పాడు. త‌మ‌లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నాడు. కాగా, గ‌త‌ ప్ర‌పంచ క‌ప్‌లలో భార‌త్‌పై పాకిస్థాన్ గెలుపొందిన దాఖ‌లాలు లేవు.

More Telugu News