మెక్సికోలో డ్రగ్స్ మాఫియా కాల్పులకు బలైన భారత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంజలి

23-10-2021 Sat 22:20
  • అమెరికాలో లింక్డ్ ఇన్ లో పనిచేస్తున్న అంజలి
  • అంజలి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్
  • పుట్టినరోజు వేడుకల కోసం మెక్సికో వెళ్లిన అంజలి
  • గ్యాంగ్ స్టర్ల కాల్పుల్లో మృతి
Indian software engineer Anjali dies of gunfire in Mexico
భారత్ కు చెందిన అంజలి అనే ఐటీ నిపుణురాలు మెక్సికోలో విషాదకర పరిస్థితుల్లో మరణించారు. 25 సంవత్సరాల అంజలి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. ఆమె అమెరికాలో లింక్డ్ ఇన్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. పుట్టినరోజు వేడుకల కోసం మెక్సికోలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తులుమ్ కు వెళ్లారు. అక్కడి ఓ హోటల్లో అంజలి బస చేశారు. ఆమె హోటల్లో ఉన్న సమయంలో రెండు డ్రగ్స్ మాఫియా గ్యాంగులు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, వారిలో అంజలి కూడా ఉన్నారు.