తన జీవితచరిత్రను సినిమాగా తీయాలని గణపతి సచ్చిదానంద స్వామి నన్ను ఆదేశించారు: బండ్ల గణేశ్

23-10-2021 Sat 21:35
  • మైసూరులో సచ్చిదానంద స్వామిని కలిసిన గణేశ్
  • స్వామివారి బయోపిక్ చాన్స్ తన అదృష్టమని వెల్లడి
  • దీన్నొక మహాయజ్ఞంలా భావిస్తానని వివరణ
  • స్వామివారిలో నిజమైన అవధూత కనిపించాడని వ్యాఖ్యలు
Bandla Ganesh met Ganapathi Sachidananda Swami in Mysore
టాలీవుడు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు. స్వామి తన జీవితచరిత్రను సినిమాగా తీయాలని ఆదేశించారని, గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను తీసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని బండ్ల గణేశ్ ట్విట్టర్ లో తెలిపారు.

స్వామివారి బయోపిక్ ను ఓ యజ్ఞంలా భావించి భక్తుల ముందు ఉంచుతానని వెల్లడించారు. కాగా, స్వామివారిని కలిసిన సందర్భంగా ఎన్నడూ లేనంత ఆనందం కలిగిందని, స్వామీజీ స్వయంగా తన జన్మరహస్యం వివరించారని బండ్ల గణేశ్ తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామిలో నిజమైన అవధూత కనిపించాడని పేర్కొన్నారు.