టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

23-10-2021 Sat 21:16
  • శనివారం మధ్యాహ్నం బాబుకు గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత
  • విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర
TDP leader Katragadda Babu dies of cardiac arrest
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. ఈ మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాట్రగడ్డ బాబు గత పాతికేళ్లలో టీడీపీలో వివిధ స్థాయుల్లో పనిచేశారు. అనేక పదవులు చేపట్టారు.

 దశాబ్దకాలంగా పేదలకు ఉచితంగా ఔషధాలు పంపిణీ చేస్తూ దాతృత్వ గుణాన్ని చాటుకుంటున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను కూడా ఆయన చేపట్టారు. పార్టీ పరంగా చూస్తే కృష్ణా జిల్లాలో వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

కాగా, గుండెపోటుకు గురైన కాట్రగడ్డ బాబును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన ఈ సాయంత్రం మరణించారు. బాబు కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసినట్టు భావిస్తున్నారు.