ఇంగ్లండ్ తో సూపర్-12 మ్యాచ్... 55 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

23-10-2021 Sat 20:58
  • దుబాయ్ లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 14.2 ఓవర్లలో ఆలౌటైన కరీబియన్లు
  • అదిల్ రషీద్ కు 4 వికెట్లు
West Indies collapsed for just fifty five runs against England
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో సూపర్-12 మ్యాచ్ లో వెస్టిండీస్ దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కరీబియన్లు 14.2 ఓవర్లలో 55 పరుగులకు అంతా అవుటయ్యారు. ఆ జట్టులో 13 పరుగులు చేసిన క్రిస్ గేల్ టాప్ స్కోరర్ అంటే మిగతావాళ్లు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ నుంచి టెయిలెండర్ రవి రాంపాల్ వరకు అందరూ ఘోర వైఫల్యం చవిచూశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 4, మొయిన్ అలీ 2, టైమల్ మిల్స్ 2, క్రిస్ వోక్స్ 1, క్రిస్ జోర్డాన్ 1 వికెట్ తీశారు.