Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల

TDP spokesperson Pattabhi released from Rajahmundry central jail
  • సీఎంను దూషించిన కేసులో పట్టాభికి బెయిల్
  • ఇటీవల పట్టాభిపై కేసు నమోదు
  • అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు
  • బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పట్టాభి
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి కిందట విడుదలయ్యారు. అనంతరం వాహనంలో విజయవాడ పయనమయ్యారు.

సీఎం జగన్ ను పట్టాభి అసభ్య పదజాలంతో దూషించారంటూ విజయవాడ వ్యాపారి షేక్ మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పట్టాభి హైకోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Pattabhi
Release
Rajahmundry Prison
CM Jagan
TDP
Andhra Pradesh

More Telugu News