దుల్కర్ 'కురుప్' రిలీజ్ డేట్ ఖరారు!

23-10-2021 Sat 19:08
  • దుల్కర్ తాజా చిత్రంగా 'కురుప్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • పాన్ ఇండియా స్థాయి రిలీజ్
  • నవంబర్ 12వ తేదీన థియేటర్లకు
Kurup movie release date confirmed
మలయాళ స్టార్ హీరోలలో దుల్కర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళ .. తెలుగు భాషల్లోను ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఆయన తాజా చిత్రమైన 'కురుప్' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, పోస్టర్ ను వదిలారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. పోస్టర్ చూస్తుంటే కథలో అనేక పాత్రలు .. అనూహ్యమైన మలుపులు ఉంటాయనే విషయం అర్థమవుతోంది. తెలుగులోను ఈ సినిమాను అదే టైటిల్ తో విడుదల చేస్తుండటం విశేషం.

మలయాళంలో ఈ సినిమాకి దుల్కర్ నిర్మాతగా వ్యవహరించాడు. సుశీన్ శ్యామ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇంద్రజిత్ సుకుమారన్.. సన్నీ.. శోభిత ధూళిపాళ.. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. థియేటర్లకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.