ఈటలను నేనేమీ చీకట్లో కలవలేదు: రేవంత్ రెడ్డి

23-10-2021 Sat 18:51
  • ఈటల, రేవంత్ రహస్యమంతనాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
  • బహిరంగంగానే కలిశానన్న రేవంత్
  • పలు అంశాలు మాట్లాడుకున్నామని వివరణ
  • కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని వెల్లడి
Revanth Reddy condemns KTR comments
ఓ రిసార్ట్ లో ఈటల, రేవంత్ రహస్యంగా మంతనాలు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని వెల్లడించారు. వేం నరేందర్ రెడ్డి కుమారుడి పెళ్లిపత్రిక అందజేత సందర్భంగా నేతలందరం కలిశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేతప్ప ఈటలను తానేమీ చీకట్లో కలవలేదని స్పష్టం చేశారు.

తామిద్దరం కలిసిన సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నామని అన్నారు. కేసీఆర్ కుట్రలను ఈటల వివరించారని రేవంత్ తెలిపారు. అసలు, కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా? కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది మీ కాంట్రాక్టర్ కాదా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.