Vallabhaneni Vamsi: యాక్షన్ వంశీది.. డైరెక్షన్ సజ్జలది: కొల్లు రవీంద్ర

Vallabhaneni speaking in Sajjalas direction says Kollu Ravindra
  • వంశీ భాష చాలా దారుణంగా ఉంది
  • మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు
  • వంశీ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తన భాషతో ఆయన కృష్ణా జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ గుర్తుపై గెలిచిన వంశీ... ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ లనే తిడుతున్నారని విమర్శించారు. వంశీ భాషను వింటే ఆయన భార్య, పిల్లలు కూడా సిగ్గుపడతారని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్ లోనే వంశీ మాట్లాడుతున్నారని చెప్పారు. మహిళలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. వంశీ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Vallabhaneni Vamsi
Sajjala Ramakrishna Reddy
YSRCP
Kollu Ravindra
Telugudesam

More Telugu News