మెగా హీరో జోడీగా 'పెళ్లి సందD' హీరోయిన్?

23-10-2021 Sat 17:54
  • 'పెళ్లి సందD'తో పరిచయమైన నాయిక
  • గ్లామర్  పరంగా మంచి మార్కులు
  • యూత్ లో పెరుగుతున్న  క్రేజ్  
  • రవితేజ సరసన దొరికిన ఛాన్స్    
Sreeleela in mega family hero movie
'పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా కథాకథనాల సంగతి అటుంచితే, గ్లామర్ పరంగా ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. యూత్ మనసులను మొత్తంగా దోచేసింది. విశాలమైన కళ్లు .. ఆకర్షణీయమైన నవ్వు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయని చెప్పుకుంటున్నారు.

రాఘవేంద్రరావు పరిచయం చేసిన కథానాయిక గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయట. తాజాగా ఆమె మరో సినిమాను ఒప్పుకుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది.  

తెలుగులో తన రెండో సినిమాగా శ్రీలీల .. రవితేజ సరసన 'ధమాకా' చేస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఇక ఆ తరువాత సినిమాను మెగా ఫ్యామిలీ హీరోతో చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. మరి మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో చేయనుందో .. ఈ సినిమాకి దర్శక నిర్మాతలు ఎవరో త్వరలోనే తెలియనుంది.