Kangana Ranaut: హీరోయిన్ కంగన రనౌత్ కు కోర్టులో చుక్కెదురు

Mumbai court rejects Kangana Ranauts request in defamation case
  • కంగనపై జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా
  • కేసును మరో కోర్టుకు మార్చాలంటూ పైకోర్టులో కంగన పిటిషన్
  • జడ్జి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారన్న కోర్టు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై పాటల రచయిత జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ముంబై అంధేరిలోని మెట్రోపాటిలన్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతున్నారు. అయితే నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని, కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కంగన పిటిషన్ దాఖలు చేసింది.

అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సదరు కోర్టు కంగన పిటిషన్ ను తోసిపుచ్చింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నారని కోర్టు తెలిపింది. కంగనకు వ్యతిరేకంగా పక్షపాతాన్ని ప్రదర్శించలేదని చెప్పింది. చట్టబద్ధంగా వెళ్లడం కంగనకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాదని తెలిపింది. కేవలం అనుమానం కారణంగా కేసులో ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Kangana Ranaut
Bollywood
Court

More Telugu News