టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ
- ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న పట్టాభి
- ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.