Paritala Sunitha: పరిటాల సునీతకు సంతకం చేసిన ఖాళీ లెటర్ హెడ్ పంపించిన వల్లభనేని వంశీ.. లోకేశ్ కు సవాల్!

Vallabhaneni Vamsi offers blank signed letterhead to Paritala Sunitha
  • వచ్చే ఎన్నికల్లో వంశీ, కొడాలి నాని ఓడిపోతారన్న పరిటాల సునీత
  • సునీతను తాను వదినగానే చూస్తానన్న వంశీ
  • దమ్ముంటే నారా లోకేశ్ గన్నవరంలో పోటీ చేయాలని సవాల్
కొడాలి నాని, వల్లభనేని వంశీలకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే అని.. కానీ వారిద్దరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిన్న మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాకు తాను ఇప్పుడే సిద్ధమని వల్లభనేని వంశీ అన్నారు. తన ఖాళీ లెటర్ హెడ్ పై సంతకం చేసి పరిటాల సునీతకు పంపించారు. ఈ లెటర్ హెడ్ పై స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను స్పీకర్ కు పంపాలని సునీతకు సూచించారు. సునీతను తాను వదినగానే చూస్తానని చెప్పారు. తల్లికి, గర్భస్థ శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగేంత వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. దమ్ముంటే నారా లోకేశ్ గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
Paritala Sunitha
Telugudesam
Nara Lokesh
Vallabhaneni Vamsi
YSRCP

More Telugu News