KTR: సీఎం అంతటి వ్యక్తిని బూతులు తిట్టడం మంచి పద్ధతి కాదు: కేటీఆర్

  • ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ
  • సీఎంను బూతులు తిట్టారంటూ టీడీపీపై వైసీపీ ఫైర్
  • రాజకీయాల్లో హుందాతనం అవసరమన్నకేటీఆర్  
  • అసహనానికి తావులేదని వ్యాఖ్య 
KTR mentions AP politics in TRS plenary

ఏపీ సీఎం జగన్ ను టీడీపీ నేతలు బూతులు తిట్టారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అంతటివ్యక్తిని బూతులు తిట్టడం మంచి పద్ధతి అనిపించుకోదని అన్నారు. రాజకీయాల్లో కొనసాగే వారికి హుందాతనం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకైనా అధికారం అనేది ప్రజలు ఇస్తేనే వస్తుందని, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించగలిగినప్పుడే గెలుస్తారని కేటీఆర్ వివరించారు.

"ఏపీలో సీఎంను పట్టుకుని పచ్చి బూతులా? టీడీపీ ఆఫీసులపై ఎవరు దాడి చేశారన్నది పక్కనబెడితే, మూల కారణం ఏంటన్నది చూడాలి" అని హితవు పలికారు. రాజకీయాల్లో అసహనానికి తావులేదని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో ఓటమిపాలైన వారు అధికారం కోసం వెంపర్లాడడం కంటే ప్రజల వద్దకు వెళ్లి తమకు ఎందుకు ఓటు వేయాలో వివరించి, వారిని బతిమాలుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని కోరుకోవడం రాజకీయ నేతలకు తగదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా కేటీఆర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News