Prabhas: ప్రభాస్ కు అనుష్క బర్త్ డే గ్రీటింగ్స్

Anushka Shetty greets Prabhas on his birthday
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్
  • సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలన్న అనుష్క
పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా డార్లింగ్ కు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అనుష్క శెట్టి కూడా గ్రీటింగ్స్ తెలిపింది.

'హ్యపీ బర్త్ డే. జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి నీకు బెస్ట్ గా ఉండాలి. ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మంది హృదయాల్లోకి నీ కథలు చేరాలి. నీవు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి' అని ట్వీట్ చేసింది.

ప్రభాస్, అనుష్క ఇద్దరూ పలుచిత్రాల్లో కలిసి నటించారు. అందమైన, సక్సెస్ ఫుల్ జంటగా వీరిద్దరూ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.
Prabhas
Anushka Shetty
Birthday
Greetings

More Telugu News