Tollywood: నా పేరు విక్రమాదిత్య.. దేవుణ్ణి కాను.. మీలో ఒకడినీ కాను.. అంటూ వచ్చిన 'రాధేశ్యామ్'​ టీజర్​

Radhe Shyam Teaser Out For Fans On the Occasion of Prabhas birth Day
  • ప్రేక్షకులకు ప్రభాస్ పుట్టినరోజు కానుక
  • నాకన్నీ తెలుసూ.. అయినా చెప్పనంటూ డైలాగులు
  • డైలాగులకు తగ్గట్టు జస్టిన్ ప్రభాకరన్ బ్యాగ్రౌండ్ స్కోర్
పుట్టినరోజు నాడు అభిమానులకు ప్రభాస్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. రానున్న తన సినిమా రాధేశ్యామ్ నుంచి మొన్న పోస్టర్ ను రిలీజ్ చేసిన ఆయన.. ఇవాళ టీజర్ తో వచ్చాడు. ‘నా పేరు విక్రమాదిత్య.. నాకన్నీ తెలుసు’.. అంటూ సస్పెన్స్ ఫుల్ డైలాగ్స్ చెప్పి అలరించాడు.

‘నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ కాను.. మీలో ఒకడినీ కాను’ అంటూ డైలాగులతో హీట్ పెంచాడు.

ఇక ఇందులో విక్రమాదిత్యగా చాలా కూల్ గా కనిపించాడు. డైలాగులకు తగ్గట్టు జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 14న సినిమా విడుదల కానుంది.

Tollywood
Prabhas
Radheshyam
Pooja Hegde
UV Creations
Radha Krishnan

More Telugu News