Chevireddy Bhaskar Reddy: గీతా ఆర్ట్స్ నుంచి 'బొమ్మరిల్లు' భాస్కర్ కి మరో ఛాన్స్!

  • భారీ హిట్ కొట్టిన 'బ్యాచిలర్'
  • అఖిల్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు
  • గీతా ఆర్ట్స్ 2కి భారీ లాభాలు
  • మరో కథపై భాస్కర్ కసరత్తు
Bhaskar in Geetha Arts 2 Next Movie

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలను ఇస్తూ ముందుకు వెళుతున్నారు. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను మాత్రమే ఈ బ్యానర్ కింద సెట్ చేస్తున్నారు. కానీ అఖిల్ సినిమా కోసం మాత్రం బాగానే ఖర్చు పెట్టారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు.

విడుదలైన తొలిరోజునే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అఖిల్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబడుతోంది. గీతా ఆర్ట్స్ 2 కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు .. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న భాస్కర్ నిరీక్షణ కూడా ఈ సినిమా హిట్ తో ఫలించింది.

ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ 2 వారు 'బొమ్మరిల్లు' భాస్కర్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంచి కథను రెడీ చేసుకోమని చెప్పారట. ప్రస్తుతం ఆ పనిలోనే భాస్కర్ ఉన్నాడని అంటున్నారు. బన్నీ వాసుకి .. భాస్కర్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్టు అల్లు అరవింద్ స్టేజ్ పైనే చెప్పాడు గనుక, ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే అనుకోవాలి.

More Telugu News