విశాఖలో కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం జగన్

22-10-2021 Fri 20:50
  • రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
  • శనివారం సాయంత్రం 4 గంటలకు విశాఖ పయనం
  • సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
CM Jagan will attend Karanam Dharmasri daughter wedding in Visakha
సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా హాజరుకానున్నారు. ధర్మశ్రీ కుమార్తె వివాహం నగరంలోని ఎంజీఎం పార్కులో జరగనుంది. ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.

అంతకుముందు పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 4.45 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్ పోర్టు గేట్-1 వద్ద ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో 20 నిమిషాల పాటు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడ్నించి బయల్దేరి వుడా పార్క్, జీవీఎంసీ స్మార్ట్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ్నించి కరణం ధర్మశ్రీ కుమార్తె పెళ్లికి హాజరవుతారు. ఆపై గన్నవరం తిరిగొస్తారు.