'మా' ఉమెన్ ఎంపవర్ మెంట్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన మంచు విష్ణు

22-10-2021 Fri 18:48
  • మేనిఫెస్టో అమలుపై దృష్టి సారించిన మంచు విష్ణు
  • నటీమణుల భద్రతకు తొలి అడుగు వేశామని వెల్లడి
  • మహిళల సాధికారత, ఫిర్యాదుల కోసం కమిటీ
  • సలహాదారుగా 'పద్మశ్రీ' సునీతా కృష్ణన్
Manchu Vishnu announced Women Empowerment and Grievance Cell
మేనిఫెస్టో అమలు దిశగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 'మా'కు అనుబంధంగా 'ఉమెన్ ఎంపవర్ మెంట్, గ్రీవెన్స్ సెల్' (డబ్ల్యూఈజీసీ) ఏర్పాటు చేస్తున్నట్టు మంచు విష్ణు వెల్లడించారు. 'పద్మశ్రీ' అవార్డు గ్రహీత, ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు సునీత కృష్ణన్ ఈ కమిటీకి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు.

'మా'లో సభ్యత్వం తీసుకునేందుకు మరింత మంది మహిళా కళాకారులు ముందుకు రావాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు. 'మా' మహిళా సభ్యులకు భద్రత కల్పించడంలో డబ్ల్యూఈజీసీ ఏర్పాటు తొలి అడుగు అని వివరించారు. నటీమణులకు మరింత శక్తిని అందించడంలో 'మా' తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

'రావణలంక' ట్రైలర్ ను ఆవిష్కరించిన మంచు విష్ణు

'మా' అధ్యక్షుడు మంచు విష్ణు నేడు 'రావణలంక' చిత్రం ట్రైలర్ ను ఆవిష్కరించారు. మురళీశర్మ, దేవ్ గిల్, అస్మిత, క్రిష్, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బీఎన్ఎస్ రాజు దర్శకుడు. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.