కొంగలా ఉన్న హరీశ్ రావు కొంగ కథలే చెపుతారు: ఎంపీ అరవింద్

22-10-2021 Fri 17:34
  • హరీశ్ రావు ఒక ఫకీరులాంటోడు
  • ఓడిపోయే నియోజకవర్గాలకు హరీశ్ ను కేసీఆర్ పంపిస్తుంటారు
  • దుకాణాలకు పోయి చైన్లను తీసుకెళ్లడమే కవిత పని
BJP MP Arvind fires on Harish Rao
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ ను ఫకీర్ తో పోల్చారు. ఉపఎన్నికలు వచ్చినపుడల్లా ఓడిపోయే నియోజకవర్గానికి హరీశ్ రావు అనే ఫకీర్ ను కేసీఆర్ పంపిస్తారని ఎద్దేవా చేశారు. కొంగలా ఉన్న హరీశ్ అన్నీ కొంగ కథలే చెపుతారని అన్నారు. అమలు చేయలేని మేనిఫెస్టోను ఎందుకు పెట్టావని కేసీఆర్ ను ప్రశ్నించారు. విధివిధానాలు లేనివాటిని ఎందుకు పెట్టారని అడిగారు. దుకాణాలకు పోవడం అక్కడి నుంచి చైన్లను తీసుకెళ్లడమే కల్వకుంట్ల కవిత పని అని విమర్శించారు.