కోహ్లీ కంటే రోహిత్ శర్మకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు: షోయభ్ అఖ్తర్

22-10-2021 Fri 16:59
  • కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పడంలో సందేహం లేదు
  • రోహిత్ అంతకంటే గొప్ప బ్యాట్స్ మెన్
  • భారత్ లో నాక్కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు
Rohit has more fans than Kohli says Shoib Akhtar
ప్రపంచ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కు అభిమానులు ఉన్నాయి. మన దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా కోహ్లీని అభిమానించే వారికి కొదువ లేదు. మరోవైపు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయభ్ అఖ్తర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కంటే ఎక్కువ మంది అభిమానులు రోహిత్ శర్మకు ఉన్నారని చెప్పారు.

టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయభ్ మాట్లాడుతూ... కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే రోహిత్ శర్మ అంతకంటే గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పారు. ఇండియాలో ఇంజమామ్ ఉల్ హక్ వంటి వాడు రోహిత్ అని కితాబునిచ్చారు. భారత్ పట్ల పాక్ ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. తనకు కూడా భారత్ లో చాలా మంది అభిమానులు ఉన్నారని అన్నారు. భారత్ నుంచి ఎంతో ప్రేమను పొందిన పాకిస్థానీ అదృష్ఠవంతుడిని తానని చెప్పారు.