Salmonella: ​మెక్సికో ఉల్లిపాయలు తిన్న అమెరికన్లకు సోకుతున్న సాల్మొనెల్లా వ్యాధి

Mexican onions causes Salmonella decease in Americans
  • అమెరికాలో పెరుగుతున్న సాల్మొనెల్లోసిస్ కేసులు
  • ఆసుపత్రులకు పరిగెడుతున్న ప్రజలు
  • మెక్సికో నుంచి అమెరికాకు ఉల్లిపాయల దిగుమతి
  • ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుర్తింపు
ఓపక్క కరోనా వ్యాధితో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు సాల్మొనెల్లా బ్యాక్టీరియా మరోపక్క ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రజలు సాల్మొనెల్లోసిస్ బారినపడుతున్నారు. పొట్టలో నొప్పి, విరేచనాలు, జ్వరం, వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. రానున్న రోజుల్లో ఇది మహమ్మారిలా పరిణమించే అవకాశం ఉందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.

ప్రస్తుతం అమెరికాలోని 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా కేసులు వెలుగు చూశాయి. కాగా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయల ద్వారానే ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారినపడుతున్నారని సీడీసీ గుర్తించింది. అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ మెక్సికో నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకుని దేశంలోని అవుట్ లెట్లకు పంపిణీ చేసింది. ఇళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ ఆ ఉల్లిగడ్డలతో చేసిన వంటకాలు తిన్నవారే సాల్మొనెల్లా బారినపడుతున్నట్టు వెల్లడైంది.

మెక్సికో ఉల్లిగడ్డలు తిన్న 6 గంటల్లోనే ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలో దుష్ప్రభావాలు చూపుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, చికిత్సతో కోలుకోవచ్చని చెబుతున్నారు.
Salmonella
Bacteria
USA
Mexican Onions

More Telugu News