Kishan Reddy: అబద్ధం ముందు పుట్టి.. కేసీఆర్ తర్వాత పుట్టాడు: కిషన్ రెడ్డి

KCR cheating Telangana people since 7 years says Kishan Reddy
  • ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
  • ఈటలను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు
  • కాంగ్రెస్ తో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదు
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని గతంలో చెప్పిన కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడని ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని... అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ హెచ్చుతగ్గులను బట్టి గ్యాస్ ధరలు ఉంటాయని అన్నారు.
Kishan Reddy
BJP
KCR
TRS
Etela Rajender
Huzurabad

More Telugu News