'అల్లుడి భాగోతం అత్తే చెప్పాలి' అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు

22-10-2021 Fri 14:33
  • మంగళగిరిలో చంద్రబాబు 36 గంటల దీక్ష
  • దుష్టుడు, దుర్మార్గుడు అంటూ వ్యాఖ్యలు
  • ఎన్టీఆర్ ను అమాయకుడ్ని చేసి మోసగించారని వెల్లడి
  • కొడుక్కి తిట్టడం కూడా నేర్పాడని విమర్శలు
Lakshmi Parvathi comments on Chandrababu
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు సంధించారు. "అల్లుడి భాగోతం అత్తే చెప్పాలి మరి... ఎన్టీఆర్ ను అమాయకుడ్ని చేసి మోసగించాడు. ఆ దుష్టుడి విధానాలు ఇప్పటికీ మారలేదు. అబద్ధానికి, అతడికి అవినాభావ సంబంధం ఉంది. కొడుకు అసమర్థుడు అనుకుంటే అతడికి అవినీతి, అబద్ధాలతో పాటు తాజాగా తిట్టడం కూడా నేర్పించాడు. అదీ చంద్రబాబు సంస్కారం" అంటూ ధ్వజమెత్తారు.

అంతేకాదు, చంద్రబాబు దీక్ష శిబిరంపై సెటైర్ వేశారు. "ఇవాళ అల్లుడి నిరాహార దీక్ష శిబిరం పక్కనుంచే వచ్చాను. అక్కడంతా బిర్యానీ పొట్లాలు, డబ్బుల గురించిన మాటలే వినిపించాయి. మధ్యలో ఓ తెర కూడా కట్టారు. బహుశా తినడం ఎవరూ చూడకూడదనేమో!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.