ఆ ఫొటో చూసి.. హీరోయిన్ రెజీనాపై నెటిజ‌న్ల విమర్శ‌లు!

22-10-2021 Fri 13:29
  • హీరోయిన్ చేతిలో ప్రముఖ కంపెనీకి చెందిన‌ విస్కీ బ్రాండ్
  • ప్రచారంలో భాగంగా ప‌ట్టుకున్న రెజీనా
  • ఇటువంటి యాడ్ ఎందుకు చేస్తున్నావంటూ విమ‌ర్శ‌లు
  • అన్‌ఫాలో అవుతామ‌న్న కామెంట్లు
netizens slams regina
హీరోయిన్ రెజీనాపై నెటిజ‌న్లు విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్రముఖ కంపెనీకి చెందిన‌ విస్కీ బ్రాండ్ కు ప్రచారం చేయ‌డ‌మే అందుకు కార‌ణం. ఒక మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఆమె తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశారు. అందులో ఆమె మద్యం సీసాలు ముందు పెట్టుకుని, మ‌ద్యం గ్లాసును చేతితో పట్టుకుని కూర్చుంది. తాను తొమ్మిదేళ్ల‌ వయసులో యాంకరింగ్ రంగంలోకి వచ్చానని, ప్ర‌స్తుతం సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొంది.

త‌న‌ ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుంద‌ని, ఈ మ‌ధుర‌క్ష‌ణాల‌ను మ‌ద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని ఆమె ఆ బ్రాండ్ పేరు చెప్పింది. దీంతో ఇటువంటి యాడ్ ఎందుకు చేస్తున్నావంటూ ఆమెపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆమెను సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో అవుతామ‌ని కొంద‌రు కామెంట్లు చేశారు.

కాగా, ఇటీవలే అమితాబ్ బ‌చ్చ‌న్, మహేశ్ బాబు వంటి కొంద‌రు సినీనటులు పొగాకు ఉత్పత్తుల యాడ్స్ లో క‌న‌ప‌డ్డారు. దీంతో వారిపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అమితాబ్ బ‌చ్చ‌న్ ఆ యాడ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.