Amarinder Singh: సెక్యులరిజం గురించి కాంగ్రెస్ మాట్లాడడం మానుకోవడం బెటర్.. రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు?: విరుచుకుపడిన అమరీందర్

  • హరీశ్ రావత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన అమరీందర్
  • బీజేపీ నుంచి వచ్చిన సిద్ధూను నెత్తిన పెట్టుకున్నారని మండిపాటు
  • సాగు చట్టాల రూపకర్త అమరీందరేనన్న సిద్ధూ
Dont Talk About Secularism  Amarinder Tears Into Congress

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పదేపదే సెక్యులరిజం గురించి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి, నానా పటోలే వంటి నాయకులు ఆరెస్సెస్ నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. బీజేపీ నుంచి వచ్చిన సిద్ధూను నెత్తిన పెట్టుకున్నారని, మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు అంశంపై పరిశీలిస్తామని ఇటీవల అమరీందర్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ.. తనలోని సెక్యులర్ అమరీందర్‌ను ఆయన చంపుకొన్నారని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా అమరీందర్ కాంగ్రెస్‌పై ఇలా విరుచుకుపడ్డారు. మరోవైపు, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల నిర్మాత అమరీందరేనని ఆరోపించారు.

More Telugu News