Meenakshi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Meenakshi Chowdary opposite Mahesh Babu
  • లక్కీ ఛాన్స్ కొట్టిన మీనాక్షి చౌదరి 
  • 'ఆహా' కోసం మోహన్ బాబు 'షో'
  • 'దర్జా' ఒలకబోస్తున్న సునీల్!  
*  ప్రస్తుతం రవితేజతో కలిసి 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న కథానాయిక మీనాక్షి చౌదరి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు మీనాక్షి ఎంపికైనట్టు సమాచారం. ఇందులో ప్రధాన నాయికగా పూజ హెగ్డే నటిస్తుంది.
*  త్వరలో 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'అన్ స్టాపబుల్' షోకు నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేయనున్న సంగతి విదితమే. ఈ క్రమంలో మరో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా 'ఆహా'కు ఓ షో చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి.
*  హాస్యనటుడు సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దర్జా'. సలీం మాలిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా తాజాగా విడుదల చేశారు.   
Meenakshi
Mahesh Babu
Mohan Babu
Balakrishna

More Telugu News