'జెట్టి' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించిన బాలకృష్ణ

  • సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో జెట్టి
  • నందితా శ్వేత, మన్యం కృష్ణ జంటగా చిత్రం
  • త్వరలో విడుదల
  • చిత్రబృందాన్ని అభినందించిన బాలయ్య
Balakrishna launches Jetti movie theatrical trailer

సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత,  మన్యం కృష్ణ జంటగా వస్తున్న చిత్రం 'జెట్టి'. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నేడు ఆవిష్కరించారు. అనంతరం ట్రైలర్ ను ఆసక్తిగా తిలకించారు. కంటెంట్ బాగుందంటూ చిత్రబృందాన్ని అభినందించారు.

మత్స్యకారులకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణుమాధవ్ ఈ సినిమా నిర్మించారు. కాగా, ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా, తమ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారంటూ బాలయ్యకు చిత్ర నిర్మాత వేణు మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News