అజయ్ దేవగణ్ తో బేర్ గ్రిల్స్ 'ఇంటూ ద వైల్డ్'... ప్రోమో విడుదల

21-10-2021 Thu 19:42
  • 'ఇంటూ ద వైల్డ్'  పేరిట ప్రముఖులతో స్పెషల్ ఎపిసోడ్లు
  • గతంలో మోదీ, రజనీకాంత్, అక్షయ్ లతో సాహసాలు
  • ఈసారి అజయ్ దేవగణ్ తో జోడీ కట్టిన గ్రిల్స్
  • ఈ నెల 22న డిస్నీ ప్లస్ యాప్ లో ప్రసారం
 Bear Grylls Into The Wild with Ajay Devgan
ప్రముఖ మనుగడ పోరాటాల నిపుణుడు బేర్ గ్రిల్స్ భారత ప్రముఖులతో సాహసాలు చేయించడం తెలిసిందే. బేర్ గ్రిల్స్ 'ఇంటూ ద వైల్డ్'  పేరిట గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లతో ఎపిసోడ్లు రూపొందించాడు. డిస్కవరీ చానల్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్లు అందరినీ అలరించాయి. తాజాగా బేర్ గ్రిల్స్ బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ తోనూ సాహసాలు చేయించాడు.

వీరిద్దరి సాహసాలకు మాల్దీవులు వేదికగా నిలిచాయి. అక్కడి విశాలమైన హిందూ మహాసముద్రంలో ఈ జోడీపై 'ఇంటూ ద వైల్డ్' కార్యక్రమం చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ప్రోమోను డిస్కవరీ చానల్ నేడు విడుదల చేసింది. ఈ కార్యక్రమం ప్రీమియర్ షో తొలుత ఈ నెల 22న డిస్కవరీ ప్లస్ ఓటీటీ వేదికలో రిలీజ్ కానుంది. ఆపై ఈ నెల 25న డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. కాగా, ఈ కార్యక్రమంలో తన తండ్రి వీరూ దేవగణ్ ను తలచుకుని అజయ్ కంటతడి పెట్టడం ప్రోమోలో కనిపించింది.