ఆ ట్వీట్ నాది కాదు... అది ఫేక్: రామ్ గోపాల్ వర్మ

21-10-2021 Thu 18:31
  • సోషల్ మీడియాలో వర్మ పేరిట ట్వీట్ వైరల్
  • ఈటల వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపోటు సేమ్ అంటూ పోస్టు
  • ట్విట్టర్ లో స్పందించిన వర్మ
  • ఆ ట్వీట్ తాను చేసింది కాదని వివరణ
Ram Gopal Varma termed a tweet as fake
తెలంగాణలో ఈటల రాజేందర్ అంశానికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరిట ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దానిపై వర్మ స్పందించారు. అది తాను చేసిన ట్వీట్ కాదని, అది ఫేక్ అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ ట్వీట్ ను కూడా వర్మ పంచుకున్నారు.

ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారానికి, చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారం ఒకేలా అనిపిస్తున్నాయంటూ వర్మ తెలిపినట్టుగా ఆ ట్వీట్ ఉంది. దీనిపై అందరితో చర్చించి "వెన్నుపోటు ఈటలు" అనే సినిమా తీద్దామని నిర్ణయించుకున్నట్టు ఆ పోస్టులో వర్మ వివరించినట్టు పేర్కొన్నారు.