హుజూరాబాద్ లో దళితబంధును అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్

21-10-2021 Thu 18:02
  • పిటిషన్ వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య
  • కొనసాగుతున్న పథకాన్ని ఆపేయడం సరికాదన్న పిటిషనర్
  • ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం
PIL filed in TS High Court to continue Dalit Bandhu in Huzurabad
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో ఈసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈసీ తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదని తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాన్ని ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇతర పథకాలను ఆపకుండా... కేవలం దళితబంధును మాత్రమే ఆపాలని ఆదేశించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. ఈసీ ఉత్తర్వులు ఎస్సీ, ఎస్టీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని... అందువల్ల ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.