గుమ్మడికాయ కొట్టేసిన 'గని'

21-10-2021 Thu 17:59
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • సయీ మంజ్రేకర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో సునీల్ శెట్టి
  • డిసెంబర్ 3వ తేదీన విడుదల
Ghani movie update
వరుణ్ తేజ్ కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. ఈ సినిమా ఈ పాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే.

కానీ కరోనా కారణంగా షూటింగును మొదలుపెట్టడంలోనే జాప్యం జరిగింది. ఆ తరువాత కరోనా ప్రభావం తగ్గుతూ ఉండగానే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగును కానిచ్చేశారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది .. గుమ్మడికాయ కూడా కొట్టేశారు.

ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఇక జగపతిబాబు .. ఉపేంద్ర .. సునీల్ శెట్టి .. నవీంచంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు.