పాకిస్థాన్ లో వేగంగా విస్తరిస్తున్న ఎప్సిలాన్ వేరియంట్

21-10-2021 Thu 16:51
  • పాకిస్థాన్ లో బయటపడిన ఎప్సిలాన్ వేరియంట్
  • తొలుత ఈ వేరియంట్ కాలిఫోర్నియాలో గుర్తింపు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న పాక్ ఆరోగ్యశాఖ
Corona virus cases are increasing in Pakistan
పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పొరుగునున్న పాకిస్థాన్ లో కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ దేశంలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ ను ఎప్సిలాన్ గా పిలుస్తున్నారు. తొలుత ఈ వేరియంట్ కాలిఫోర్నియాలో బయటపడింది. ఈ వేరియంట్ యూకేలో కూడా వ్యాప్తి చెందింది. ఈ ఎప్సిలాన్ లో కూడా ఐదు వేరియంట్లను గుర్తించారు. కేసులు పెరుగుతుండటంతో పాకిస్థాన్ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.