కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి ముందర శుభవార్త

21-10-2021 Thu 16:30
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
  • పెన్షనర్లకు డీఆర్ పెంపు
  • నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
  • ఈ ఏడాది జులై నుంచి వర్తింపు
Center hikes DA and DR ahead of Diwali
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి ముందర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ, పెన్షనర్లకు 3 శాతం డీఆర్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 28 శాతం డీఏ ఇస్తున్నారు. ఇప్పుడది 31 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో 47 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తాజా పెంపు ఈ ఏడాది జూలై నుంచి వర్తింపచేయనున్నారు. ఇక, కేంద్రం నిర్ణయంతో 68 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కూడా లబ్ది చేకూరనుంది.