నులక మంచంపై పవన్, నాటు బండిపై రానా... ఫొటో ఇదిగో!

21-10-2021 Thu 16:15
  • భీమ్లా నాయక్ లో నటిస్తున్న పవన్, రానా
  • సెట్స్ నుంచి తాజా ఫొటో
  • విశ్రాంతి తీసుకుంటున్న పవన్, రానా
  • అభిమానుల నుంచి విశేష స్పందన
Pawan and Rana at Bheemla Naik sets
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఇందులో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుండగా, రానా రౌడీగా నటిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో పవన్ నులకమంచంపై విశ్రాంతి తీసుకుంటుండగా, రానా ఓ బండిపై పడుకుని ఉండడం చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ పిక్ కు విశేషమైన స్పందన వస్తోంది.