'అన్ స్టాపబుల్' ప్రోమో షూట్లో బాలయ్య... ఫొటోలు ఇవిగో!

21-10-2021 Thu 15:19
  • 'ఆహా' ఓటీటీలో త్వరలో అన్ స్టాపబుల్
  • హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ
  • బాలయ్యపై ప్రోమో చిత్రీకరణ
  • సందడి చేస్తున్న ఫొటోలు
Balakrishna hosts Unstoppable talk show
'అఖండ' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఆహా' ఓటీటీ కోసం 'అన్ స్టాపబుల్' అనే టాక్ షో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య తొలిసారి ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. కాగా, ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణలో బాలకృష్ణ పాల్గొనగా, దానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

'ఆహా' యాప్ కొద్దికాలంలోనే వినూత్నమైన కంటెంట్ తో ప్రజాదరణ పొందింది. డిజిటల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తూ, భారీ సంఖ్యలో సబ్ స్క్రయిబర్లను సొంతం చేసుకుంది. కాగా, 'అన్ స్టాపబుల్' కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ నవంబరు 4న 'ఆహా' ఓటీటీలో ప్రసారం కానుంది.