తమిళ సినీ దర్శకుడు శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

  • 16 ఏళ్ల బాలికను వేధించినట్టు రోహిత్ పై కేసు నమోదు
  • క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు వేధించారన్న బాధితురాలు
  • గత ఏడాది శంకర్ పెద్ద కూతురితో రోహిత్ కు వివాహం
Director Shankars son in law booked for sexually harassing girl

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దామోదర్ తో పాటు మరో ఐదుగురుపై పోలీసులు ఈ కేసును బుక్ చేశారు. 16 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

పుదుచ్చేరిలోని మెట్టుపాలయం పీఎస్ లో కుటుంబసభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని బయటకు చెపితే చంపేస్తామని బెదిరించినట్టు తెలిపింది. దీంతో, దామోదరన్ తో పాటు ఇతరులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ఏడాది జూన్ నెలలో శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో దామోదరన్ కు వివాహం జరిగింది. ఈ పెళ్లికి సీఎం స్టాలిన్, హీరో ఉదయనిధి స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. దామోదర్ తండ్రి చెన్నైలో పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. తమిళనాడు క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీ మధురై పాంథర్స్ క్రికెట్ టీమ్ కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. శంకర్ కుమార్తె వృత్తిరీత్యా వైద్యురాలు.

More Telugu News