Travel: ఊర్లు తిరగడమే ఆ ఏడాది బుడతడి పని.. నెల సంపాదన ఎంతో తెలుసా?

This One Year Old Kid Earns 75K A Month For Travel
  • తల్లితో కలిసి ‘బేబీ బ్రిగ్స్’ టూర్లు
  • ఇప్పటికే 16 రాష్ట్రాలను చుట్టేసిన వైనం
  • నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్న చిన్నారి  
  • మూడు వారాల వయసులోనే తొలి ప్రయాణం
ఆ బుడతడి వయసు ఏడాది. ఊర్లు తిరగడమే అతడి పని.. ఆ పనికి ఆ ఏడాది బుడతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? అక్షరాలా రూ.75 వేలు (వెయ్యి డాలర్లు). అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్ అనే బుడతడు ఇప్పటికే 45 విమానాలు ఎక్కేశాడు.. దేశంలోని 16 రాష్ట్రాలు చుట్టేశాడు. అలాస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, యూటా, ఇదాహో సహా చాలా నగరాలను చుట్టివచ్చాడు.

గత ఏడాది అక్టోబర్ 14న జన్మించిన ఈ చిన్నోడు.. మూడు వారాల వయసులోనే తన ప్రయాణాలను మొదలుపెట్టేశాడు. అలాస్కాలో ఎలుగుబంట్లు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో తోడేళ్లు, యూటాలోని అతి సున్నితమైన ఆర్చ్, కాలిఫోర్నియా బీచ్ ల అందాలను చూశాడు. తన తల్లి జెస్ తో కలిసి ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు.

అంతేకాదండోయ్.. ఈ చిన్నారి బ్రిగ్స్ కు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. 30 వేల మంది ఫాలోవర్లున్నారు. పార్ట్ టైం టూరిస్ట్స్ పేరిట జెస్ ఓ బ్లాగ్ నూ నడుపుతోంది. వాస్తవానికి ఆమెకు ట్రావెల్ అంటే చాలా ఇష్టమట. అయితే, గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని భయపడిందట. వెంటనే మనసులోని మాటను తన భర్తకు చెప్పానని, తను ప్రోత్సహించే సరికి ఓ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తనకు ఎదురైన అనుభవాలను రాసుకురావాలని అనుకున్నట్టు చెప్పింది.

అప్పటికి బేబీ ట్రావెల్ కు సంబంధించిన సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లేవీ లేకపోయేసరికి తనకు ఆ ఐడియా వచ్చిందని చెప్పింది. ఇప్పుడు తన బేబీ బ్రిగ్స్ కు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారని ఆమె తెలిపింది. అదండీ ఆ చిన్నారి కథ.. తన తల్లి ఆలోచనల నుంచి పుట్టిన ‘బేబీ ట్రావెల్’తో నెలకు వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు.  

Travel
USA
Baby Briggs

More Telugu News