వేమన పద్యం రివర్స్ అయింది.. నీళ్లలోనే మొసలి అంతు చూసిన ఏనుగు.. ఇదిగో వీడియో

21-10-2021 Thu 14:21
  • ఆఫ్రికా సఫారీలో ఘటన
  • నీళ్లు తాగేందుకు పిల్లలతో కలిసి నదిలోకి దిగిన ఏనుగు
  • మాటేసి దాడి చేసిన మొసలి
  • తిరగబడిన తల్లి ఏనుగు
Elephant Kills Crocodile In Water
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థాన బలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ..

...ఈ వేమన పద్యం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ పద్యం ఓ ఏనుగు విషయంలో రివర్స్ అయింది. నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉండే మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు దాని అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపింది. ఈ ఘటన ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగింది. వాస్తవానికి రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్ అవుతోంది.

నీళ్లు తాగడానికి తన పిల్లలతో కలిసి ఏనుగు నదిలోకి దిగింది. అక్కడే మాటు వేసి ఉన్న మొసలి.. ఏనుగు పిల్లను పట్టేందుకు ప్రయత్నించింది. అంతే ఒక్కసారిగా మొసలిపై ఏనుగు దాడి చేసింది. తన తొండం, కాలితో మొసలి ప్రయత్నాన్ని అడ్డగించి.. తొక్కి చంపేసింది.