ఏం తప్పు చేశారని నారా లోకేశ్ పై కేసు పెట్టారు?: ఆలపాటి

21-10-2021 Thu 14:13
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోంది
  • ఏపీలో అరాచకపాలన సాగుతోంది
  • మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను హత్య చేశారు
Why case is filed against Alapati Raja
ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోందని... ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని... దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఏం తప్పు చేశారని నారా లోకేశ్ పై కేసు పెట్టారని ఆయన ప్రశ్నించారు. మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ సుధాకర్ ను హత్య చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేశారని చెప్పారు. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు.