టీడీపీ నేత పట్టాభిని తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించిన పోలీసులు

21-10-2021 Thu 14:12
  • సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తొలుత తోట్లవల్లూరు పీఎస్ కు తరలింపు
  • ఈ మధ్యాహ్నం విజయవాడ తీసుకువచ్చిన వైనం
  • కాసేపట్లో వైద్యపరీక్షలు
Police brought TDP Spokesman Pattabhi to Vijayawada
ఏపీలో రాజకీయ విద్వేషాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ, అధికార వైసీపీ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొని ఉంది. సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేయడం తెలిసిందే. తొలుత ఆయనను కృష్ణా జిల్లా తోట్లవల్లూరు తీసుకువచ్చిన పోలీసులు, ఈ మధ్యాహ్నం అక్కడి నుంచి విజయవాడకు  తరలించారు. కాసేపట్లో పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.  

కాగా, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పట్టాభిని తరలించే క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద ఓ మోస్తరు ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు పటిష్ఠ బందోబస్తు నడుమ పట్టాభిని విజయవాడ తీసుకువచ్చారు. మరికాసేపట్లో ఆయనకు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.