ఘనంగా వైవా హర్ష వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు

21-10-2021 Thu 13:59
  • ఫొటోను ట్వీట్ చేసిన మారుతి
  • నిర్మాత ఎస్కేఎన్, కమెడియన్ ప్రవీణ్ హాజరు
  • ఈ ఏడాది జనవరి 11న నిశ్చితార్థం
  • స్నేహితురాలిని ప్రేమ పెళ్లి చేసుకున్న హర్ష
Cine Fraternity Atttends Viva Harsha Wedding
కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన పెళ్లికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్, కమెడియన్ ప్రవీణ్ లు పెళ్లిలో సందడి చేశారు. వైవా హర్షతో దిగిన ఫొటోను మారుతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ పోస్ట్ పెట్టారు.

హర్ష చెముడు.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. ‘వైవా’ కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి సక్సెస్ అయ్యాడు. అందరికీ బాగా చేరువయ్యాడు. దీంతో వైవా హర్షగా అతడికి పేరు పడిపోయింది. ఆ తర్వాత 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

కాగా, ఈ ఏడాది జనవరి 11న తన స్నేహితురాలు అక్షర రీసుతో అతడికి నిశ్చితార్థం అయింది. ఎం. కామ్ చదివిన ఆమెతో హర్షకు నాలుగేళ్ల పరిచయం ఉంది. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.